: చెక్ బౌన్స్ కేసులో మారిన నిబంధనలు
ఇటీవలి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన నెగోషబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ బిల్లు సవరణలను కేంద్రం నోటిఫై చేయడంతో, చెక్ బౌన్స్ విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా, ఎవరో ఇచ్చిన చెక్కు తీసుకుని, అది బౌన్స్ అయితే, చెక్కు జారీ చేసిన బ్యాంకు లేదా చెక్కిచ్చిన వ్యక్తి ఉన్న ప్రాంతంలోని కోర్టుల్లోనే ఫిర్యాదు చేయాల్సిన అవసరం తప్పుతుంది. ఇకపై చెక్కును జమ చేసిన బ్యాంకు ఉన్న ప్రాంతంలోనే, కేసు పెట్టవచ్చు. కాగా, ప్రస్తుతం దేశంలోని వివిధ కోర్టుల్లో 18 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులు విచారణ దశలో ఉన్నాయి. వీటిల్లో 38 వేల కేసులు హైకోర్టు స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయి. అత్యధిక కేసుల్లో ఫిర్యాదిదారులు వాయిదాల నిమిత్తం ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త సవరణలు అమల్లోకి రావడంతో ఇకపై చెక్ బౌన్స్ కేసుల్లో సులువుగానే కేసులు పెట్టే అవకాశం ఏర్పడింది.