: అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారంగానే.... రక్తంతో రాసిన ఉగ్రవాదులు!


ఆదివారం ఆఫ్ఘనిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయంపై సంభవించిన ఉగ్రవాద దాడి అఫ్జల్ గురు ఉరితీతకు ప్రతీకారంగానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడులకు పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు దాడులకు ముందు కాన్సులేట్ భవనం గోడలపై రక్తంతో పలు నినాదాలు రాశారు. ఇది అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారమని రాశారు. కాగా జమ్ము కాశ్మీర్ కు చెందిన అప్జల్ గురు 2000 డిసెంబరు 13న పార్లమెంటుపై దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం కోర్టు అతనికి మరణశిక్ష విధించగా, అతన్ని 2013లో ఉరి తీసిన విషయం విదితమే. ఆప్ఘనిస్తాన్ లోని భారతరాయభార కార్యాలయంపై దాడులకు దిగిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో అనేక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. భవనంలోని గోడలపై ఉగ్రవాదులు ఉర్దూలో పలు నినాదాలు రాశారు. ఈ భవనంలోకి చొచ్చుకు వెళ్లిన ఇద్దరు ఉగ్రవాదులపై సెక్యూరిటీ ఏజెన్సీ ఫైరింగ్ జరిపి మట్టుబెట్టింది.

  • Loading...

More Telugu News