: దాడుల కోసం పాక్ ఎయిర్ బేస్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు!
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో దాడులకు తెగబడిన ఉగ్రవాదులు అంతకుముందు పాకిస్తాన్ లోని ఒక ఎయిర్ బేస్ లో శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ దాడుల వెనుక పాకిస్తాన్ సైన్యం, పాక్ నిఘావర్గం ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికార వర్గాలు తెలియజేసిన సమాచారం ప్రకారం, ఈ దాడులకు ముందుగా సదరు ఉగ్రవాదులకు పాకిస్తాన్ లోని ఒక ఎయిర్ బేస్ లో పటిష్టమైన శిక్షణను అందించినట్లు తెలుస్తోంది. ఫలితంగానే వారు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ప్రవేశించి దాడులు చేయగలిగారని నిఘా వర్గాల భోగట్టా. ఈ దాడులకు ఉగ్రవాదులు ఏకే 47కు అధునాతన రూపమైన అండర్ బ్యారల్ గన్ ను వినియోగించడం చూస్తేనే వారు ఎంతటి శిక్షణను పొందారో తెలుస్తుందని భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.