: మోదీజీ ఈ ప్రశ్నలకు బదులివ్వండి!...పఠాన్ కోట్ దాడి నేపథ్యంలో ప్రధానికి కాంగ్రెస్ 5 ప్రశ్నలు


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డ ఘటనకు బీజేపీ సర్కారు తీసుకుంటున్న అపసవ్య నిర్ణయాలే కారణమన్న దిశగా కాంగ్రెస్ స్పందించింది. ఓ వైపు పాకిస్థాన్ భూభాగం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులు దేశంపై దాడులకు పాల్పడుతుంటే, పాక్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరంపై ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిలదీసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ నిన్న ప్రధానికి ఐదు ప్రశ్నలు సంధించారు. సదరు ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనంద్ శర్మ సంధించిన ప్రశ్నల విషయానికొస్తే... 1) గతేడాది చర్చలు రద్దైన తర్వాత మొన్న బ్యాంకాక్ లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య భేటీలో ఏ విధమైన అవగాహన కుదిరింది? 2) పాక్ తన హామీలను నిలబెట్టుకోని కారణంగా తన హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాక్ కు వెళ్లలేదు. మరి పాక్ నుంచి ఏ హామీల మేరకు లాహోర్ లో మోదీ పర్యటించారు? 3) తన లాహోర్ పర్యటనలో పాక్ జాతీయ భద్రతా సలహాదారు కనిపించలేదు. దీనిపై మోదీకి అనుమానాలేవీ రాలేదా? 4) చర్చల్లో పాక్ ఆర్మీ, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ భాగస్వామ్యముందని మోదీ భావిస్తున్నారా? దీనిపై పాక్ నుంచి మోదీకి లభించిన హామీ ఏమిటి? 5) ముంబై మారణహోమం సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీపై చర్యలు తీసుకోమని పాక్ ను మేం కోరాం. ఇప్పటిదాకా ఆ దేశం తీసుకున్న చర్యలేమిటి? అంటూ ఆనంద్ శర్మ ఐదు ప్రశ్నాస్త్రాలను మోదీకి సంధించారు.

  • Loading...

More Telugu News