: అద్నాన్ సమీకి ఒక రూలు, మిగిలిన వారికి మరొక రూలా?


పాకిస్తాన్ కు చెందిన గాయకుడు అద్నాన్ సమీకి ఇటీవల భారత పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇలాగే చాలాకాలంగా భారత్ లో స్థిరపడిన పాకిస్తాన్ వాసులకు భారత్ పౌరసత్వం ఇవ్వకుండా మొండిచేయి చూపడంతో వారు పాక్ కు తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నారట. గడచిన ఏడాదికాలంలో ఇక్కడి పౌరసత్వం లభించక సుమారు 100 కుటుంబాలు తిరిగి పాకిస్తాన్ చేరుకున్నాయి. అయితే ఈ కుటుంబాల్లో చాలావరకు సింధీ, గుజరాతీయులు ఉండటం విశేషం. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే స్థిర నివాసమేర్పరచుకున్న వీరంతా తమకు భారత పౌరసత్వం లభిస్తుందని ఇన్నాళ్లూ ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. అయితే వీరంతా గాయకుడు అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఇచ్చి, తమకు ఎందుకు ఇవ్వరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News