: గుంతకల్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం!
అమరావతి ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టినట్లు ఆగంతుకులు ఫోన్ కాల్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ లో అమరావతి ఎక్స్ ప్రెస్ ను నిలిపి వేశారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ లను రంగంలోకి దించారు. ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కాగా, ఎవరైనా ఆకతాయిలు ఈ ఫోన్ కాల్ చేశారా? అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.