: చేప @ 78 లక్షలు...కేజీ 39 వేలు
జపాన్ లో ట్యూనా చేపలకుండే డిమాండ్ అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున ట్యూనాలు దిగుమతి చేసుకునే దేశాల్లో జపాన్ ఒకటి. తాజాగా అక్కడ ఓ ట్యూనా చేప 78 లక్షల ధర పలికి ఆశ్చర్యపరిచింది. 200 కేజీల బరువున్న ఈ ట్యూనా చేపకు ఇంత ధర చెల్లించడం వెనుక కారణం ఏంటంటే, దాని తోక నీలి రంగులో ఉండడమే! నీలి రంగు తోక ఉన్న ట్యూనాలను జపనీయులు బాగా ఇష్టపడతారు. అంతే కాకుండా ఎక్కువ ధర చెల్లించి చేపను కొనుగోలు చేస్తే తమ వ్యాపారం బాగుంటుందని జపాన్ రెస్టారెంట్ యజమానులు భావిస్తారు. ఈ నమ్మకంతోనే ఓ రెస్టారెంట్ యజమాని 200 కేజీల బరువు కలిగిన ఆ ట్యూనాను 78 లక్షల రూపాయల ధరకు కొనుగోలు చేశారు.