: పోలీసుల అదుపులో ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళ్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు


మతం ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్న ముస్లిం ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ పట్ల తెలంగాణలో కూడా యువకులు ఆకర్షితులవుతున్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు సిరియా ప్రయాణమయ్యారు. నాగ్ పూర్ మీదుగా సిరియా వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకున్న ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడుగురు ఐఎస్ఐఎస్ లో చేరిన తరువాత మరింతమంది ముస్లిం యువకులను ఉచ్చులోకి లాగేందుకు వీరు పెద్ద ప్రణాళికను రచించుకున్నారు. మతోన్మాద భావజాలం కలిగిన పలువురు యువకులతో సంబంధాలు కొనసాగిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. న్యాయస్ధానంలో హాజరుపరిచి ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని ఎవరు? ఎప్పుడు? ఎలా? కాంటాక్ట్ చేశారు? ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చూపుతున్న తాయిలాలు ఏంటి? వీరితో ఎవరెవరు టచ్ లో ఉన్నారు? వంటి విషయాలన్నీ విచారణలో వెలుగు చూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News