: వెయ్యి పరుగుల హీరోను అభినందించిన సచిన్
ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ లెవెల్ టోర్నమెంట్ లో కేసీ గాంధీ స్కూల్ తరపున బరిలో దిగి ఆర్యా గురుకుల్ పాఠశాల జట్టుపై 1009 పరుగులు చేసిన ప్రణవ్ ధనవాడేను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. క్రికెట్ లో ప్రణవ్ మరిన్ని కొత్త మైలు రాళ్లు అధిగమించాలని సచిన్ ఆకాంక్షించాడు. కాగా, ఎంసీఏ నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో ప్రణవ్ ధనవాడే 1009 పరుగులు చేయడం ద్వారా 116 ఏళ్ల పాటు నిలిచి ఉన్న రికార్డును తుడిచిపెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.