: సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్న క్రికెటర్!
తాను హీరోగా నటిస్తున్న సినిమా కోసం క్రికెటర్ శ్రీశాంత్ తెలుగు నేర్చుకుంటున్నాడు. సానా యాదిరెడ్డి దర్శకత్వంలో శ్రీశాంత్ హీరోగా బహుభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో తన డైలాగులకు శ్రీశాంతే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. తెలుగు చక్కగా మాట్లాడేందుకుగాను పర్సనల్ గా ఒక ట్యూటర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్న యాక్టింగ్ వర్క్ షాప్ లో జరుగుతున్న మూడు రోజుల కార్యక్రమానికి శ్రీశాంత్ హాజరవుతున్నాడని సమాచారం. కాగా, మలయాళ సూపర్ స్టార్ మోహల్ లాల్ కూడా మరోపక్క తెలుగు నేర్చుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న మోహన్ లాల్ తెలుగు నేర్చుకుంటున్నాడు.