: పఠాన్ కోట్ ఘటనపై 3 కేసులు నమోదు
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వద్ద జరిగిన ఉగ్రదాడి ఘటనపై మూడు కేసులు నమోదయ్యాయి. ముందు ఈ కేసులను పఠాన్ కోట్ లోని పోలీస్ స్టేషన్ లలో నమోదు చేశారు. తరువాత వాటిని జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ) సంస్థకు బదలాయించారు. మొదటి కేసు ఎస్పీ సల్విందర్ సింగ్ అపహరణపై, రెండో కేసు టాక్సీ డ్రైవర్ ను చంపడంపై నమోదయ్యాయి. ఈ రెండు కేసులను పఠాన్ కోట్ జిల్లాలోని నరోత్ జైమల్ సింగ్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు. ఇక మూడవ, అత్యంత ప్రధానమైన కేసు పఠాన్ కోట్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్ డివిజన్ నం.2లో నమోదు చేశారు.