: చెన్నైలో కలకలం... బాంబు బెదిరింపుతో 11 స్కూళ్లకు సెలవు!


ఎవరో ఆకతాయి చేసిన ఫోన్ కాల్ 11 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో పెను కలకలం రేపింది. చెన్నై పరిధిలోని శాంతోమ్ చర్చ్ సమీపంలోని పాఠశాలల్లో బాంబులు ఉన్నాయని నిన్న నగర పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా పాఠశాలలకు సమాచారం ఇచ్చారు. విషయం బయటకు తెలిసి పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలకు గురై స్కూళ్ల వద్దకు పరుగులు పెట్టారు. ఇక ఆయా స్కూళ్లకు చేరుకున్న పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేసి ఎటువంటి బాంబులూ లేవని తేల్చారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో మరిన్ని తనిఖీలు చేసేందుకై నేడు కూడా ఈ 11 పాఠశాలలూ తెరవలేదు.

  • Loading...

More Telugu News