: పరువు నష్టం కేసులో జైట్లీ స్టేట్ మెంట్ రికార్డు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరువు నష్టం దావా కేసులో విచారణ నిమిత్తం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పటియాల హౌజ్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కేజ్రీ, ఆప్ నేతలు ట్విట్టర్, ఫేస్ బుక్ లో నిరాధార ఆరోపణలు చేశారని తన స్టేట్ మెంట్లో తెలిపారు. తన పరువుకు భంగం కలిగించారని ఆయన పేర్కొన్నారు. కాగా, డీడీసీఏ నుంచి జైట్లీ నయాపైసా తీసుకోలేదని, ఆప్ నిరాధార ఆరోపణలతో ఆయన పరువు ప్రతిష్ఠలకు తీరని భంగం కలిగించిందని జైట్లీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆప్ చేసిన ట్వీట్టు, ఫేస్ బుక్ కామెంట్లను సాక్ష్యాలుగా చూపారు.