: రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరీకి 'కల్యాణలక్ష్మి' పథకం వర్తింపు: కేసీఆర్
రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లా గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన కేటీపీపీ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి పథకాన్ని తమకు కూడా వర్తింపజేయాలని బీసీలు అడుగుతున్నారని అన్నారు. కేవలం బీసీలే కాకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మన్ననలు పొందుతోందని, బంగారు తెలంగాణ సాధించి తీరుతామని కేసీఆర్ పేర్కొన్నారు.