: ఓడినా... ప్రతిపక్షాల తీరు మారలేదు!: సీఎం కేసీఆర్


సంస్కారం లేని ప్రతిపక్షాలు అవే మాటలు మాట్లాడుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈరోజు వరంగల్ జిల్లా గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన కేటీపీపీ రెండో యూనిట్ ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, తమకెవరూ బాసులు లేరని, ప్రజలే తమకు బాసులని అన్నారు. ప్రతిపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికలలో ఓటమి పాలైన ప్రతిపక్షాల మాటలు గతంలో లాగానే ఉన్నాయని..వారి తీరులో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. ప్రతిపక్షాల మాటలను తానేమి పట్టించుకోనని, రాష్ట్రాభివృద్ధే తన లక్ష్యమని... అందుకోసం నిరంతరం కష్టపడతానని అన్నారు.

  • Loading...

More Telugu News