: ఏపీ నుంచి తెలంగాణకు రెండువేల మెగావాట్ల విద్యుత్
ఆంధ్రప్రదేశ్ 2వేల మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రానికి అమ్మనుంది. పవర్ ట్రేడింగ్ కార్పోరేషన్ (పిటిసి) ద్వారా ఈ మొత్తం విద్యుత్ ను తెలంగాణకు ఇవ్వనుంది. 2016 జూన్ నుంచి 2017 మే నెల వరకు ఏపీలో మిగులు విద్యుత్ ఉండనుందని ఏపీ ట్రాన్స్ కో పంపిణీ కంపెనీలకు సమాచారం ఇచ్చింది. ప్రతి నెల దాదాపు 300 మెగావాట్ల నుంచి 500 మెగావాట్ల వరకు ఏడాది పాటు మిగులు విద్యుత్ ఉండనుందని తెలిపింది. అదే సమయంలో తెలంగాణ డిస్కమ్ లు మే 27, 2016 నుంచి మే 25, 2017 మధ్య 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఏపీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ మిగులు విద్యుత్ ను తెలంగాణకు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.