: కృష్ణా జిల్లాలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు


కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసరలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కీసరలో జన్మభూమి కార్యక్రమంలో తమను కనీసం పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో వారికి దీటుగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య పరస్పర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు తోపులాటకు దిగారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం సాగుతుండగానే రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కలబడి పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై లాఠీ ఛార్జ్ కు దిగాల్సి ఉంటుందని హెచ్చరించడంతో కార్యకర్తలు శాంతించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News