: మే 2న తెలంగాణ ఎంసెట్
మే 2వ తేదీన తెలంగాణ ఎంసెట్ ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ తో పాటు పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మే 12న ఈసెట్, 19న ఐసెట్, 27న ఎడ్ సెట్, 29న పీజీ ఈసెట్, 24న లా సెట్, పీజీ లాసెట్, 11న పీఈ సెట్ లను నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, జాతీయ స్థాయి పరీక్షల తేదీలను కూడా పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి ఆయా తేదీలను ప్రకటించినట్లు పాపిరెడ్డి చెప్పారు.