: నల్గొండ జిల్లాలో ‘కిడ్నీ’ రాకెట్ గుట్టురట్టు!
నల్గొండ జిల్లాలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. ఒక్కో కిడ్నీకి రూ.లక్ష చొప్పున విక్రయాలు జరుపుతున్నారు. ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం గురించి పోలీసులు తెలిపిన వివరాలు.. ఆన్ లైన్ ప్రకటన చూసి సురేష్ అనే యువకుడు కిడ్నీ విక్రయించాడు. ఆ తర్వాత ఏజెంట్ గా మారి ఆ కిడ్నీ రాకెట్ తో చేతులు కలిపాడు. పేద యువకులను టార్గెట్ గా చేసి ఈ ముఠా కిడ్నీలు కాజేస్తోంది. సదరు వ్యక్తులను నల్గొండ జిల్లా నుంచి మహారాష్ట్ర తీసుకెళ్లి కిడ్నీ విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఈ రాకెట్ బారిన పడిన వారిలో సుమారు 30 మందికి పైగా వ్యక్తులు ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ ముఠా సభ్యులు, సూత్రధారుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.