: పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
మెదక్ జిల్లా పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డిపై ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ రఘునందన్ రావు కోరారు. ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో మహీపాల్ రెడ్డికి రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష పడిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ విధంగా అనర్హత పొందిన ఎమ్మెల్యేకు జీతం ఎలా చెల్లిస్తారని, అందుకు అసెంబ్లీ సెక్రటరీపై కూడా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. మరోవైపు పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరుగుతుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ప్రకటించారు. ప్రస్తుత చట్టం ప్రకారం రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధిపై అనర్హత అమల్లోకి వస్తుంది. అందువల్ల ఉపఎన్నిక జరుగుతుందని ఈసీ అంటోంది.