: కొనసాగిన ప్రణవ్ సూపర్బ్ ఇన్నింగ్స్... 1000 పరుగులు


ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అత్యద్భుత రికార్డు నమోదైంది. స్కూల్ స్థాయి పోటీల్లో నిన్న 652 పరుగులు చేసి 117 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన ముంబై యువ సంచలనం ప్రణవ్ ధనవాడే, నేడు తన ఇన్నింగ్స్ కొనసాగించి 1000 పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వాడు ప్రణవ్. హెచ్టీ భండారీ ఇంటర్ స్కూల్ క్రికెట్ కప్ పోటీల్లో కేసీ గాంధీ స్కూల్ తరపున ప్రణవ్ బరిలోకి దిగగా, ప్రత్యర్థిగా ఉన్న ఆర్యా స్కూల్ బౌలర్లు అతనిపై ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోయారు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో ప్రణవ్ పై క్రీడా ప్రపంచం అభినందనల వర్షం కురిపిస్తోంది. ఒక్కరోజులో భారత క్రికెట్ క్రీడా ప్రపంచంలో సెలబ్రిటీగా మారిపోయాడు. ఆల్ ది బెస్ట్ ప్రణవ్!

  • Loading...

More Telugu News