: 'ఎనీథింగ్ బట్ ఖామోష్' పేరిట శత్రుఘ్న సిన్హా జీవితచరిత్ర


బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా జీవితచరిత్ర పుస్తక రూపం దాల్చింది. 'ఎనీథింగ్ బట్ ఖామోష్' పేరిట రాసిన ఆ పుస్తకాన్ని రేపు ఢిల్లీలోని క్లారిడ్జ్ హోటల్ లో ఆయన రాజకీయ గురువు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ విడుదల చేయనున్నారు. ఆ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, సిన్హా కుటుంబ సభ్యులు పాల్గొంటారు. ప్రస్తుత రాజకీయ సందర్భానికి అనువైన శీర్షికతో (ఖామోష్-నిశ్శబ్దం)తో జీవితకథను వెలువరిస్తున్న షాట్ గన్, ఈ పుస్తకానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తో ముందుమాట రాయించారు. ఇప్పటికే బీజేపీలో అసమ్మతి ఎంపీగా వ్యవహరిస్తున్న శత్రుఘ్న... తాజా చర్యతో మరింత వివాదాలు రాజేసే అవకాశం ఉండొచ్చు.

  • Loading...

More Telugu News