: పఠాన్ కోట్ సందర్శించనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి
పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఇవాళ సందర్శించనున్నారు. ఆయనతో పాటు వైమానికదళానికి, సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. రెండు రోజుల కిందట పఠాన్ కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రవాదులు ప్రవేశించి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రి వెళుతున్నారు.