: ఇద్దరు టీ తాగితే, ఏడుగురు సైనికుల ప్రాణాలు బలా? శివసేన నిప్పులు


భారత్ పై జరిగిన ఉగ్రదాడిపై శివసేన నిప్పులు చెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ లో దిగకుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని తన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. ఇద్దరు నేతలు కలసి టీ తాగినందుకు, ఏడుగురు సైనికుల ప్రాణాలను బలివ్వాలా? అని ప్రశ్నించింది. భారత్ కు ఎన్నడూ పాకిస్థాన్ నమ్మదగిన దేశం కాదని, మోదీ కూడా ఆ దేశాన్ని నమ్మరాదని హెచ్చరించింది. ఈ దాడి తరువాత భారత సరిహద్దులు రక్షణాత్మకంగా లేవని మరోసారి వెల్లడైందని సామ్నా సంపాదకీయంలో శివసేన విరుచుకుపడింది. అంతర్గత భద్రతలో లోపాలు సిగ్గు చేటని, వీరమరణం పొందిన సైనికులకు మాత్రం సామాజిక మాధ్యమాల్లో నివాళులు అర్పిస్తున్నారని విమర్శించింది. "నవాజ్ షరీఫ్ తో చాయ్ తాగినందుకు మన సైనికులు ఏడుగురు ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. ఆరుగురు ఉగ్రవాదులు వస్తే అంతకుమించిన ప్రాణాలు పోయాయి. ఇదేనా దేశ భద్రత?" అని ప్రశ్నించింది. భారత్ తో శాంతి చర్చలు కొనసాగాలంటే, తక్షణం జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను ఇండియాకు అప్పగించాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News