: పఠాన్ కోట్ దాడి ఆధారాలను పాక్ ముందుంచిన అజిత్ దోవల్


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడి నేటికి నాలుగు రోజులవుతోంది. ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ ఆరుగురు ముష్కరులను ఎన్ఎస్జీ కమెండోలు మట్టుబెట్టారు. ఇంకా ఎయిర్ బేస్ లో ఎవరైనా దాక్కున్నారా? అన్న కోణంలో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడికి పాల్పడింది తామేనని యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ నిన్న ప్రకటించింది. అయితే తమ దేశ భూభాగంలోనే ఈ దాడికి కుట్ర జరిగిందా? అన్న విషయంపై పాకిస్థాన్ ఇప్పటిదాకా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. నేటి ఉదయం పాక్ జాతీయ భద్రతా సలహాదారు నాసిర్ ఖాన్ జంజువాతో ఆయన మాట్లాడారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల నుంచి పాక్ కు సంబంధించిన కొన్ని ఆధారాలను దోవల్, జంజువా ముందు పెట్టారు. దీంతో ఆధారాలున్నాయి, చర్యలు తీసుకోవాల్సిన వంతు మీదేనంటూ దోవల్ పాక్ కు తేల్చిచెప్పినట్లైంది. మరి పాక్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందన్న విషయం తేలాల్సి ఉంది.

  • Loading...

More Telugu News