: టీడీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత మహీధర్ రెడ్డి!
ఏపీ టీడీపీలోకి ఇతర పార్టీల నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఎం.మహీధర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఆయనను టీడీపీలోకి తీసుకురావడానికి మాజీ మంత్రి, గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా టీడీపీ తరపున పోటీచేసి పరాజయం పాలైన ఆదాల ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారని అంటున్నారు. వైసీపీ, టీడీపీలు రెండింటి నుంచి మహీధర్ రెడ్డికి ఆహ్వానం ఉంది. అయితే చివరికి ఆదాల మంత్రాంగం ఫలించడంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారని తెలిసింది. సంక్రాంతి పండగ తరువాత ఆయన టీడీపీలో చేరవచ్చని భావిస్తున్నారు.