: తీర్థ యాత్రలకు వెళ్లా... అందుకే కనిపించలేదంటున్న మల్లాది విష్ణు


బెజవాడలో కలకలం రేపిన కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దాదాపు నెల తర్వాత విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. ఐదు నిండు ప్రాణాలను బలిగొన్న కల్తీ మద్యం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన క్షణాల్లో కనిపించకుండా పోయిన మల్లాది విష్ణు నిన్న రాత్రి నగరంలోని తన సొంతింటికి వచ్చారు. అరెస్ట్ తప్పించుకునేందుకే మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని మీడియా కోడై కూసింది. పోలీసులు కూడా అదే భావనతో ఉన్నారు. అయితే ఓ 15 రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రం షిరిడీలో కనిపించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. తాజాగా నేటి ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మల్లాది విష్ణు కూడా తాను తీర్థ యాత్రలకు వెళ్లానని ప్రకటించారు. ఈ కారణంగానే కొద్దిరోజుల పాటు ఎవరికీ అందుబాటులోకి రాలేకపోయానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News