: అజ్ఞాతం వీడిన మల్లాది విష్ణు.. రేపు కృష్ణలంక పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు అజ్ఞాతవాసం వీడారు. నిన్న రాత్రి విజయవాడలోని తన సొంతింటికి చేరుకున్న మల్లాది విష్ణు, కొద్దిసేపటి క్రితం పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. బెజవాడలోని కృష్ణలంకలో మద్యం విక్రయాలు సాగిస్తున్న స్వర్ణ బార్ లో కల్తీ మద్యం ఘటనలో ఐదుగురు చనిపోయారు. మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్ పేరిట ఉన్న ఈ బార్ లో ఘోరం జరిగిన నేపథ్యంలో మల్లాది విష్ణును పోలీసులు ఈ కేసులో 9వ నిందితునిగా చేర్చారు. దీంతో నెల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన విష్ణు, నిన్న కోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో అజ్ఞాతం వీడారు. రేపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్న ఆయన పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.