: 'రోడ్డు మీద కాళ్లెత్తి పడుకొన్న పక్షి...' చంద్రబాబు చెప్పిన పిట్టకథ


ఎవరు నిర్వహించాల్సిన బాధ్యతలను వారే నిర్వహించాలని గుర్తు చేస్తూ, చంద్రబాబు చెప్పిన ఓ పిట్టకథ జన్మభూమి సభలో ప్రజలను ఆకర్షించింది. "రోడ్డు మీద ఓ పక్షి పడుకొంది. తన కాళ్లను ఆకాశం వైపు చూపిస్తూ, అది వెల్లికిలా ఉంది. అదే దారిలో వెళుతున్న ఓ గుర్రం పక్షిని చూసి, ఎందుకు కాళ్లు పైకిఎత్తి పడుకున్నావు? అని ప్రశ్నించింది. దానికి సమాధానంగా ఆ పక్షి, ఆకాశం భూమి మీదకు పడిపోతోంది. దాన్ని ఆపడానికి నా కాళ్లను అడ్డుగా పెడుతున్నాను అని చెప్పిందట. దీంతో పగలబడి నవ్విన గుర్రం, నువ్వు ఆపితే ఆకాశం పడకుండా ఆగిపోతుందా? అని ప్రశ్నించగా, చిన్న కాళ్లే కదాని నేను చూస్తూ కూర్చుంటే ఎలా? ఎవరు అడ్డుకుంటారు? అని పక్షి చెప్పింది" అంటూ, ఎవరి పనిని వారు నెరవేర్చాలని, సమాజహితం కోసం అది తప్పనిసరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ పిట్టకథను బాబు తెనాలి సభలో చెప్పడం జరిగింది.

  • Loading...

More Telugu News