: త్వరలో కానిస్టేబుళ్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ: ఏపీ డీజీపీ రాముడు
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ఏపీ డీజీపీ జేవీ రాముడు అన్నారు. అందువల్లే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చట్టసవరణ చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. కర్నూలులో ఇవాళ ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ లో ఆయుధగారం నిర్మాణానికి డీజీపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో కానిస్టేబుళ్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు.