: వెంకన్న సాక్షిగా చంద్రబాబుపై రోజా విమర్శలు... జాబులెక్కడని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్యే


వైసీపీ మహిళా నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నేటి ఉదయం తిరుమల కొండపై శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వెంకన్న దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో టీడీపీ ప్రచారం చేసిందని గుర్తు చేసిన ఆమె, చంద్రబాబు అధికారంలోకి వచ్చినా, జాబులెక్కడ? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పక్షం వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.

  • Loading...

More Telugu News