: ప్రధానిని లాహోర్ లో కాల్చి చంపుండేవారు: మరాఠీ విద్యావేత్త
చెప్పాపెట్టకుండా లాహోర్లో దిగిన ప్రధాని నరేంద్ర మోదీని అక్కడి ఉగ్ర శక్తులు కాల్చి చంపే అవకాశముందని, ఇకపై ఇలాంటి పర్యటనలు వద్దని మరాఠీ సాహిత్య సమ్మేళన్ నూతన చీఫ్ గా ఎన్నికైన శ్రీపాల్ సబ్నిస్ కాలేజీ విద్యార్థుల సభలో ప్రసంగించడం వివాదాన్ని రేపింది. లాహోర్ లో ఆయన్ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసి ఉండేవారని సబ్నిస్ వ్యాఖ్యానించగా, ఆయన కేవలం సాహిత్యానికి సంబంధించి మాత్రమే మాట్లాడితే సరిపోతుందని, మోదీ గురించి వ్యాఖ్యలు చేయనవసరం లేదని బీజేపీ ప్రతినిధి మాధవ్ భండారీ హితవు పలికారు. భండారీ వ్యాఖ్యలపైనా స్పందించిన సబ్నిస్, తాను ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న ప్రేమ, ఆప్యాయతలతోనే ఈ వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని స్పష్టం చేశారు. ఆయన లాహోర్ లో దిగుతున్నారని తెలిసి తాను తీవ్రమైన ఆందోళన చెందానని అన్నారు.