: కర్నూలు జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు... టీడీపీ నేతను హత్య చేసి, మొండాన్ని తీసుకెళ్లిన ప్రత్యర్థులు


ఫ్యాక్షన్ ఖిల్లా కర్నూలు జిల్లాలో మరోమారు కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని బనగానపల్లె మండలం రామకృష్ణాపురంలో టీడీపీకి చెందిన నేతను ఆయన ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ ప్రభాకర్ నాయుడు హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న టీడీపీ నేత నగేశ్ పై నేటి ఉదయం ఆయన ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో నగేశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రక్తపు మడుగులో పడి చనిపోయిన నగేశ్ మృతదేహాన్ని ముక్కలు చేసిన దుండగులు తలను అక్కడే వదిలేసి మొండాన్ని తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రతిదాడులు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. చనిపోయిన నగేశ్ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News