: పెట్ కేర్ పోర్టల్ కు టాటాల దన్ను... ‘డాగ్ స్పాట్’లో రతన్ టాటా పెట్టుబడి


స్టార్టప్ కంపెనీలు... ప్రత్యేకించి ఈ-కామర్స్ లో చిన్న సంస్థలకు టాటాల మద్దతు వెల్లువెత్తుతోంది. టాటా గ్రూపు సంస్థలకు చైర్మన్ ఎమెరిటస్ గా వ్యవహరిస్తున్న భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, ఇటీవల వినూత్న తరహాలో పెట్టుబడులు పెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇప్పటికే పలు ఈ-కామర్స్ సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తూ నిధులను అందించిన రతన్ టాటా, తాజాగా పెట్ కేర్ పోర్టల్ గా దినదినాభివృద్ధి చెందుతున్న ‘డాగ్ స్పాట్. కామ్’లో పెట్టుబడి పెట్టారు. మరింత మంది పారిశ్రామికవేత్తలతో కలిసి ఆయన డాగ్ స్పాట్ లో వాటాలు కొనుగోలు చేశారు. ఈ మేరకు టాటా పెట్టుబడులను డాగ్ స్పాట్ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ రానా అధెయో నిన్న ధ్రువీకరించారు. అయితే టాటా ఎంతమేర పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని మాత్రం అధెయో వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News