: ఆడోళ్లను ఏదైనా చేస్తే అక్కడే కాల్చేస్తా..!: ఢిల్లీ పోలీస్ బాస్ సంచలన వ్యాఖ్యలు
భారత రాజ్యాంగం అనుమతించి వుంటే, మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఘటనా స్థలిలోనే కాల్చి చంపడమో లేదా ఉరి తీసి చంపడమో చేస్తానని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ వ్యాఖ్యానించారు. ఇండియాలో రాజ్యాంగం అందుకు అనుమతి ఇవ్వదని, తాము నిబంధనల ప్రకారమే నడుస్తామని అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య లింగ నిష్పత్తి తగ్గిపోవడం కూడా యువతులపై నేరాలు పెరగడానికి కారణమని అన్నారు. మదమెక్కిన కొందరు మహిళలను తల్లిగానో, చెల్లిగానో చూడటం లేదని, అందువల్లే 21 ఏళ్ల వ్యక్తి కూడా 80 ఏళ్ల మహిళపై, ఐదేళ్ల బాలికపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మహిళల భద్రతకు తాము కృషి చేస్తున్నామన్నారు.