: అమరావతిలో వెనిస్ తరహా ఆకాశహర్మ్యం.... వెనుజియా పేరిట భారీ భవంతికి ప్రైవేట్ బిల్డర్స్ ప్లాన్


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని అధునాతన హంగులతో నిర్మించేందుకు ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు సింగపూర్ సంస్థతో మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయించిన ప్రభుత్వం త్వరలోనే నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించనుంది. అయితే సర్కారుకు దీటుగా ప్రైవేట్ బిల్డర్స్ కూడా అమరావతికి వరల్డ్ క్లాస్ లుక్ ఇచ్చేందుకు తమ వంతు యత్నాలను ముమ్మరం చేశారు. నిర్మాణ రంగంలో అపార అనుభవం సాధించిన రామకృష్ణ హౌసింగ్ అమరావతిలో సరికొత్త ఆకాశహర్మ్యానికి శ్రీకారం చుడుతోంది. ప్రపంచంలోనే అధునాతన నిర్మాణాలకు పేరెన్నికగన్న వెనిస్ నగర నిర్మాణాల తరహాలో ‘రామకృష్ణ వెనుజియా’ పేరిట ఆ సంస్థ గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున వర్సిటీకి ఆనుకుని 31 అంతస్తుల భారీ ఆపార్ట్ మెంట్ ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం విస్తీర్ణంలో 86 శాతాన్ని ల్యాండ్ స్కేపింగ్ కు వినియోగించనుండగా, కేవలం 14 శాతం విస్తీర్ణంలో మాత్రమే భవన నిర్మాణాలు ఉండటం దీని ప్రత్యేకత.

  • Loading...

More Telugu News