: ముంబై దాడుల ముష్కరుల కంటే... పఠాన్ కోట్ ఉగ్రవాదులు సుశిక్షితులు


అవును, పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై విరుచుకుపడిన ఉగ్రవాదులు సుశిక్షితులు. ముంబై నగరంలో 2008లో మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదుల కంటే కూడా మెరుగైన శిక్షణ తీసుకున్న ముష్కరులు. లేకపోతే దేశంలోనే కఠోర శిక్షణతో రాటుదేలిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రంగంలోకి దిగినా, మూడు రోజుల పాటు వారు ఎలా స్వైర విహారం చేయగలరు? ఎయిర్ బేస్ కు వారు చేరుకున్న తీరు, భద్రతా దళాలతో వారు పోరు సాగిస్తున్న తీరు, దాడులకు ఎంచుకున్న సమయం తదితరాలను పరిశీలించిన కేంద్ర హోం శాఖ వర్గాలు... పఠాన్ కోట్ ఉగ్రవాదులను సుశిక్షితులైన ముష్కరులుగానే అభివర్ణిస్తున్నాయి. అంతమాత్రం శిక్షణ లేకపోతే, ఎన్ఎస్జీ సహా, ఎయిర్ బేస్ వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సైనికులతో ఉగ్రవాదులు మూడు రోజులుగా ఎలా పోరాడుతారన్నది తొలి ప్రశ్న. ఇక రాత్రి వేళల్లో ప్రత్యేకించి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 4 వరకు ఎక్కడైనా భద్రతా సిబ్బంది కాస్తంత ఆదమరచి ఉంటారు. సరిగ్గా పఠాన్ కోట్ ఉగ్రవాదులు కూడా ఈ అంశంపై స్పష్టమైన అవగాహన ఉండటంతోనే తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో విరుచుకుపడ్డారు. ఇక ఎన్ఎస్జీ కమెండోలకు దీటుగా సమాధానం ఇస్తున్న వైనం కూడా ఉగ్రవాదులను సుశిక్షితులే అని చెప్పక తప్పదని హోం శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News