: ఎస్ఆర్ నగర్ పరిధిలో కార్డాన్ అండ్ సెర్చ్... పాత నేరస్తులు, రౌడీ షీటర్ల అరెస్ట్


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు పరిధిలోని ఎస్ఆర్ నగర్ కు చెందిన పలు ప్రాంతాలు నిన్న రాత్రి ఖాకీల బూట్ల చప్పుళ్లతో దడదడలాడాయి. దాదాపు 400 మందికిపైగా పోలీసులు ఎస్ఆర్ నగర్ పరిధిలోని రెహ్మత్ నగర్, కార్మిక నగర్, అన్న నగర్ లలో కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు నిర్వహించారు. ఇంటింటిని సోదా చేసిన పోలీసులు 13 మంది పాత నేరస్తులతో పాటు మరో 13 మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో భాగంగా సరైన పత్రాలు లేని 63 బైకులు, 13 ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

  • Loading...

More Telugu News