: చాలా నేర్చుకున్నా... బాలీవుడ్ వదిలి వెళ్లను: సన్నీ లియోన్
గతేడాది చాలా నేర్చుకున్నానని శృంగార తార సన్నీలియోన్ తెలిపింది. గత ఏడాది చాలా ఒడిదుడుకులకు లోనయ్యానని చెప్పింది. ఎన్నో ఆశలతో చేసిన 'ఏక్ పహేలీ లీలా', 'కుచ్ కుచ్ లోచాహై' సినిమాలు అపజయం పాలవడంతో ఆందోళన చెందినట్టు తెలిపింది. ఓ సినిమా విజయం సాధిస్తే ఎంత సంతోషిస్తామో, విజయం సాధించకపోతే అంతే బాధపడతానని సన్నీ చెప్పింది. ఆ రెండు సినిమాల ద్వారా పొందిన ఓటమిని తాను మానసికంగా బలోపేతమయ్యేందుకు, ఎదిగేందుకు లభించిన అవకాశంగా భావిస్తున్నానని సన్నీ పేర్కొంది. ఏక్ పహేలీ లీలా సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనదని చెప్పింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా నటిగా తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందని ఆమె పేర్కొంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నారని, ఇప్పట్లో బాలీవుడ్ ను విడిచి వెళ్లే ప్రసక్తి లేదని సన్నీ లియోన్ స్పష్టం చేసింది.