: జెరూసలెంలో పౌరులను చంపిన పాలస్తీనియన్ల ఇళ్లను కూల్చేసిన ఇజ్రాయెల్


ఇజ్రాయెల్ ప్రధాన పట్టణం జెరూసలంలో ముగ్గురు ఇజ్రాయిలీలను చంపిన పాలస్తానీయన్ల ఇళ్లను ఇజ్రాయెల్ కూల్చేసినట్టు ప్రకటించింది. గతేడాది అక్టోబర్ లో బహాఇలయన్ అనే వ్యక్తి బస్సులో చొరబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అదే రోజు అలాఅబు జమాల్ అనే వ్యక్తి తన కారును పాదచారులపైకి ఎక్కించి ఒకరి మృతికి కారణమయ్యాడు. వీరిద్దరినీ ఇజ్రాయిెల్ పోలీసులు అప్పుడే మట్టుబెట్టారు. వారు నివసించిన ఇళ్లను సోమవారం కూల్చేసినట్టు ప్రకటించింది. గత సెప్టెంబర్ నుంచి జరిగిన పరస్పర దాడుల్లో 21 మంది ఇజ్రాయెలీలు, 131 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు.

  • Loading...

More Telugu News