: విప్రో కంపెనీ నూతన సీఈవోగా అబిద్ అలీ


విప్రో లిమిటెడ్ కంపెనీకి కొత్త సీఈవోగా అబిద్ అలీ నీమచ్ వాలా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఈ ఐటీ కంపెనీ గ్రూపు ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన నియామకానికి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సీఈవోగా ఉన్న టీకే కురియన్ స్థానంలో అబిద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. టి.కె.కురియన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రెండు నియామకాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News