: జమ్మూకాశ్మీర్ లో మూడు గంటలపాటు నిలిచిన అంతర్జాల సేవలు


జమ్మూకాశ్మీర్ లో మూడు గంటలపాటు అంతర్జాల సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ సేవలతో పాటు మొబైల్, ల్యాండ్ లైన్ సేవలు కూడా నిలిచిపోయాయని స్థానికులు మండిపడుతున్నారు. నేడు కాశ్మీర్ వ్యాలీలో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. దీని తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్టు అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల మొబైల్ ఇంటర్నెట్ పని చేస్తోందని, అయితే చాలా నెమ్మదిగా పని చేస్తోందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News