: మెహబూబా ముఫ్తీ అయితే మాకు ఇబ్బంది లేదు: బీజేపీ
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీని నియమిస్తే తమకు ఇబ్బంది లేదని బీజేపీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అని స్పష్టం చేసిన బీజేపీ, అందులో బీజేపీ కలుగజేసుకోదని స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. దీంతో ముఖ్యమంత్రి పగ్గాలు మరొకరికి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. దాంతోపాటు ఎవరికో అప్పగించే బదులు ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీకి అప్పగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీతో ఉన్న పొత్తు దీనికి అడ్డం పడే అవకాశం ఉందని పీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రకటన విడుదల చేయడం విశేషం.