: భారత్ తో తలపడనున్న వన్డే జట్టిదే...షేన్ వాట్సన్ కు షాక్!


క్రికెట్ ఆస్ట్రేలియా షేన్ వాట్సన్ కు షాకిచ్చింది. భారత్ తో సిరీస్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టును ప్రకటించింది. స్టీవ్ స్మిత్ కు కెప్టెన్ బాధ్యతలు కట్టబెట్టిన ఆసీస్ సెలెక్టర్లు, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, జార్జ్ బెయిలీ, స్కాట్ బోలాండ్, జోష్ హేజిల్ వుడ్, జేమ్స్ ఫాల్కనర్, మిషెల్ మార్ష్, షాన్ మార్ష్, మ్యాక్స్ వెల్, కేన్ రిచర్డ్ సన్, జోయెల్ ప్యారీస్, మాధ్యూ వేడ్ (కీపర్) లను ఎంపిక చేసింది. ఇందులో భారత్ తో స్టీవ్ స్మిత్, వార్నర్, ఫించ్, బెయిలీ, మ్యాక్స్ వెల్ లకు ఆడిన అనుభవముంది. భారత్ పై మంచి ట్రాక్ రికార్డు ఉన్న షేన్ వాట్సన్ కు సెలెక్టర్లు మొండి చెయ్యి చూపడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సీనియర్ ఆటగాడైన వాట్సన్ కు అంతర్జాతీయ అనుభవంతో పాటు ఐపీఎల్ లో రాణించిన ఆటగాడిగా పేరుంది. కాగా, ఆస్ట్రేలియాతో భారత జట్టు తొలి మ్యాచ్ ను పెర్త్ వేదికగా ఈ నెల 12న ఆడనుంది.

  • Loading...

More Telugu News