: ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులకు గన్స్... ఎందుకో చెప్పని బాస్!


ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వీధుల్లో ట్రాఫిక్ నియంత్రణ డ్యూటీల్లో ఉండే 1000 మంది కానిస్టేబుళ్లకు రివాల్వర్లను ఇవ్వాలని నేడు నిర్ణయించారు. అయితే, వారికి ఆయుధాలను ఎందుకు ఇస్తున్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. వాస్తవానికి ట్రాఫిక్ పోలీసుల వద్ద గన్స్ ఉండవు. వారు కేవలం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మాత్రమే పరిమితం. చాలా సార్లు వాహనదారులు వారితో గొడవకు దిగుతూ, వాగ్వాదం చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఉగ్రభయాలు పెరగడంతో బాటు, వారి వద్ద ఆయుధాలు ఉండవన్న సమాచారంతో దాడులకు తెగబడే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతోనే ఢిల్లీ పోలీసు బాస్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని తెలుస్తోంది. కాగా, ఢిల్లీ పరిధిలో 33 వేల కిలోమీటర్ల పొడవైన రహదారులున్నాయని, కానీ 5 వేల మంది మాత్రమే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారని, వారిలో ఎంపిక చేసిన వారికి మాత్రమే ఆయుధాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News