: బెట్టింగును చట్టబద్ధం చేయాలి!: జస్టిస్ లోథా


ఐపీఎల్ లో బెట్టింగును చట్టబద్ధం చేయాలని జస్టిస్ లోథా అభిప్రాయపడ్డారు. బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేసిన లోథా కమిటీ ఈ మేరకు రూపొందించిన తుది నివేదికను ఇవాళ సుప్రీంకోర్టు, బీసీసీఐకి సమర్పించింది. ఈ నేపథ్యంలో లోథా కమిటీ చేసిన పలు ప్రతిపాదనలలో బెట్టింగ్ చట్టబద్ధం చేయాలనేది కూడా ఉంది. కాగా, రెండేళ్ల క్రితం ఐపీఎల్ లో బెట్టింగ్ లు జరిగాయన్న వార్తలు వెలుగుచూడటంతో ఈ సీజన్ లో రాజస్థాన్, చెన్నై జట్లు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంచైజీల యాజమాన్యాలతో సంబంధమున్న వ్యక్తులకు ప్రత్యక్షంగా బెట్టింగ్ తో సంబంధమున్నట్లు తేలిన నేపథ్యంలో విచారణ చేపట్టిన లోథా కమిటీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.

  • Loading...

More Telugu News