: సూర్యతో సినిమా చేస్తా: రాజ్ కుమార్ హిరానీ


సూర్యతో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తానని, మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పీకే వంటి అద్భుతమైన చిత్రాలను రూపొందించిన బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెలిపాడు. ప్రముఖ నటుడు మాధవన్ బాక్సర్ గా నటించిన 'ఇరుధి సుత్రు' సినిమా ఆడియో వేడుకకు సూర్యతో పాటు హాజరైన సందర్భంగా రాజ్ కుమార్ హిరానీ మాట్లాడుతూ, సూర్య నటించిన సినిమాలు చూశానని అన్నాడు. సూర్య అద్భుతమైన నటుడని ఆయన కొనియాడాడు. కాగా, ఈ సినిమాకు రాజ్ కుమార్ ఇరానీ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆర్థిక కారణాలతో సినిమా ఆగిపోవాల్సిన దశలో నటుడు మాధవన్ చొరవతో ఇరానీ సహనిర్మాతగా వ్యవహరించేందుకు అంగీకరించాడని ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుధ కొంగర తెలిపింది.

  • Loading...

More Telugu News