: కొడుకులతో సరదాగా హృతిక్ రోషన్ ఆటో ప్రయాణం


ఈ మధ్య సినిమా స్టార్లు సరదాగా ఆటోలో ప్రయాణించడం చూస్తున్నాం. ఆ మధ్య సల్మాన్ ఖాన్ ముంబైలో ఆటో ఎక్కి ఏకంగా ఓ పార్టీకి వెళ్లాడు. ఇప్పుడు నటుడు హృతిక్ రోషన్ తన పిల్లలు హ్రేహాన్, హృదాన్ లతో కలసి ఆటోలో షికారు చేశాడు. ముంబై వీధుల్లో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేశాడు. తన కొడుకులతో ఆటోలో ప్రయాణించిన ఫోటోను తన ఫేస్ బుక్ ఖాతాలో హృతిక్ పోస్టు చేశాడు. తాము ముగ్గురం బాగా ఎంజాయ్ చేశామని, తక్కువ పాకెట్ మనీతో తన పిల్లలకు సాహస యాత్రలా అనిపించిందని, ఇలా ఇంటికి వెళ్లడం ఎంతో బాగుందని హృతిక్ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News