: పాక్ సిమ్ కార్డులున్న ముగ్గురి అరెస్టు


పాకిస్థాన్ సిమ్ కార్డులు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పఠాన్ కోట్ ఘటనతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొహాలీలో తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తుల వద్ద పాక్ సిమ్ కార్డులు, ఆటోమేటిక్ రైఫిల్స్ లభించాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో పాటు మరిన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వేట లక్ష్యంగా పోలీసులు అంగుళం అంగుళం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News