: మల్లాది విష్ణు పోలీసు విచారణకు సహకరించాలని విజయవాడ కోర్టు ఆదేశం
కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. మద్యం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న విష్ణును అరెస్టు చేయబోమని, ఆయనకు 41(ఎ) కింద నోటీసులు మాత్రమే జారీ చేస్తామని పోలీసులు వాదనల సందర్భంగా తెలిపారు. కేవలం ఆయన విచారణకు సహకరిస్తే చాలని చెప్పారు. ఈ క్రమంలో విష్ణు బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఎల్లుండి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరై సహకరించాలని ఆదేశించింది. కల్తీ మద్యం వ్యవహారం చోటు చేసుకున్నప్పటి నుంచీ తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.